గౌరారంలో అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ లోకినేని హనుమంత్ రావు
ఇది కద నిజం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బ్యూరో ఏప్రిల్ 14 : కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో గౌరారం గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ లోకినేని హనుమంత్ రావు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ అనసూయ శంకర్, ఉప సర్పంచ్ హనుమాన్లు తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా పలువురు నాయకులు పేర్కొన్నారు.
