ఆర్టిజన్ విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఏడవ రోజుకు చేరింది
ఇది కద నిజం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బ్యూరో ఏప్రిల్ 14: బాన్సువాడ: తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఉద్యోగుల సమ్మె ఏడవ రోజుకు చేరింది. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అంబేద్కర్ జయంతి సందర్భంగా బాన్సువాడ డివిజన్ ఆర్టిసన్ కార్మికులు డివిజన్ విద్యుత్ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరారు.
ర్యాలీ అనంతరం డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సమ్మె లేఖను అంబేద్కర్ విగ్రహం వద్ద సమర్పిస్తూ తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బాన్సువాడ డివిజన్‌కు చెందిన ఆర్టిసన్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
