పిట్లంలో  ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

పిట్లంలో  ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

ఇది కద నిజం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బ్యూరో ఏప్రిల్ 14: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పిట్లం గ్రామ సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్, ఉపసర్పంచ్ అవేజ్ బేగ్, గ్రామ కార్యదర్శి బలరాం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంబేద్కర్ సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని నాయకులు కోరారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, రామ్ రెడ్డి మోహన్ రెడ్డి శపథం రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *