చిన్నకొడపగల్ శివారులో రోడ్డు ప్రమాదం.. బైక్ అదుపుతప్పి డ్రైవర్ మృతి
ఇది కద నిజం ,పిట్లం: ధర్మారం గ్రామానికి చెందిన జాదవ్ రాజు (28) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన పిట్లం మండల పరిధిలో చోటుచేసుకుంది. మృతుడు హరి సింగ్ కుమారుడు కాగా, లంబాడా కులానికి చెందినవాడు. వృత్తిరీత్యా డ్రైవర్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. రాజు నిన్న (29-03-2026) తన తుఫాన్ వాహనం ఫైనాన్స్ కట్టేందుకు బైక్పై పిట్లం వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో, చిన్నకొడపగల్ గ్రామ శివారులో బైక్ అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పొలాల్లో పడిపోయాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రాజు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనపై మృతుని తండ్రి జాదవ్ హరి సింగ్ ఫిర్యాదు మేరకు పిట్లం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు తెలిపారు. మృతుడికి వివాహమైందని, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
