శ్రీ రాముని జీవితం అందరికీ ఆదర్శం

శ్రీ రాముని జీవితం అందరికీ ఆదర్శం: పద్మారావు గౌడ్ 

సికింద్రాబాద్,మార్చ్ 27 : సికింద్రాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ శుక్రవారం సికింద్రాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో సీతారామ కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. శ్రీరామ నవమి శుభాకంక్షలు తెలిపారు. శ్రీ రాముని జీవితం అందరికీ ఆదర్శప్రాయమని పద్మారావు గౌడ్ ఈ సందర్బంగా పేర్కొన్నారు. మనుషులు సన్మార్గంలో జీవించాల్సిన తీరుతెన్నులను శ్రీ రాముడు చాటిచెప్పారని అన్నారు. శ్రీరాముడి ఆశీస్సులు అందరికీ ఉండాలని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అడ్డగుట్ట, ఆజాద్ చంద్ర శేఖర్ నగర్, నార్త్ లాలాగూడ, తుకారం గేటు, లాలాపేట, నామాలగుండు, సితాఫలమండీ తదితర ప్రాంతాల్లో ఆయా నిర్వాహకులు ఏర్పాటు చేసిన సీతా రామ కళ్యాణం ఉత్సవాల్లో పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. బీ.ఆర్.ఎస్. యువ నేత రామేశ్వర్ గౌడ్, నాయకులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *