గోవూర్ లో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

గోవూర్ లో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు

నిజామాబాద్ జిల్లా మోస్ర మండలం గోవూర్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించి, శ్రీరామ నామస్మరణతో పాటు ఆటపాటలతో ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపారు. గ్రామ సర్పంచ్ లోకినేని హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామచంద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సందడి, నినాదాలు, ర్యాలీతో గోవూర్ గ్రామం మొత్తం భక్తి వాతావరణంతో మార్మోగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *