జిమ్ఖానా గ్రౌండ్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

జిమ్ఖానా గ్రౌండ్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

 

ఇది కద నిజం ,సికింద్రాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని జిమ్ఖానా గ్రౌండ్‌లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా (DYSO) నందకిశోర్ గోకుల్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. క్రీడారంగంలో మహిళలు రాణించేలా ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తోందని, ముఖ్యంగా క్రీడాకారిణులు తమ నైపుణ్యాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. మహిళా సాధికారత కేవలం మాటలకే పరిమితం కాకుండా, క్రీడా మైదానాల్లో వారి ప్రతిభ ద్వారా నిరూపితమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా రంగానికి చెందిన ప్రముఖ బాక్సింగ్ కోచ్ పి. మనోజ్ రెడ్డి, ఖేలో ఇండియా కబడ్డీ కోచ్ నిరీషన్ రెడ్డి, పవర్ లిఫ్టింగ్ కోచ్ హేమలత, ఫుట్‌బాల్ కోచ్ మహేష్ మరియు స్కేటింగ్ కోచ్ అనూప్ యమ తదితరులు పాల్గొన్నారు. వీరంతా మహిళా క్రీడాకారిణులను ఉత్సాహపరుస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడాకారులు, విద్యార్థులు మరియు క్రీడా అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వేడుకను విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *