గౌరారంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహణ

గౌరారంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహణ

పిట్లం/గౌరారం: కామారెడ్డి జిల్లా పిట్లం మండలం గౌరారం గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించి, శ్రీరామ నామస్మరణతో పాటు ఆటపాటలతో ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపారు. గ్రామ సర్పంచ్ లోకినేని హనుమంతరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరామచంద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తుల సందడి, నినాదాలు, ర్యాలీతో గౌరారం గ్రామం మొత్తం భక్తి వాతావరణంతో మార్మోగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *