ఆంధ్రప్రదేశ్లో జై స్వరాజ్ పార్టీ విస్తరిస్తోంది

“ఆంధ్రప్రదేశ్లో జై స్వరాజ్ పార్టీ విస్తరిస్తోంది”

 

జాతీయ అధ్యక్షునితో మేకల అమర్నాథ్ భేటీలో వెల్లడి

 

ఇది కద నిజం :జై స్వరాజ్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదరణ పెరుగుతోందని, పార్టీ రోజు రోజుకు జిల్లాల్లో విస్తరిస్తోందని జై స్వరాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు మేకల అమర్నాథ్ యాదవ్ అన్నారు. అనంతపురం జిల్లాలో త్వరలో మండలాల వారిగా పార్టీ కమిటీలు వేయనున్నట్లు ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడతో అన్నారు. హైదరాబాద్లోని కేఎస్ఆర్ గౌడ ఇంటిలో శ్రీరామ నవమి సందర్భంగా శుక్రవారం ఆయనను కలిసి భారత్ కూటమి ఏర్పాటు చేసినందుకు అమర్నాథ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారిరువురి మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జై స్వరాజ్ పార్టీ నిర్మాణంపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పార్టీ అధ్యక్షునితో పాటు రాష్ట్ర కమిటీని ప్రకటించాలని అమర్నాథ్ జాతీయ అధ్యక్షుడు కాసాని శ్రీనివాసరావు గౌడను కోరారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు, నియోజకవర్గాల నుంచి పార్టీ బాధ్యులను ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో సరైన నాయకత్వంతో రాష్ట్ర కమిటీని ప్రకటిస్తామని, ఇప్పటికే పలువురు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం చర్చిస్తున్నారని, సరైన సమయంలో కమిటీ ప్రకటిస్తామని కేఎస్ఆర్ గౌడ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపాలంటే ఇప్పటి నుంచే కార్యక్రమాలు ముమ్మరం చేయాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *