చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ నారగూడెం మల్లారెడ్డి స్వగృహంలో గణపతి హోమం
ఇది కద నిజం, అత్తాపూర్: చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ కన్వీనర్ నారగూడెం మల్లారెడ్డి స్వగృహం ఆదివారం భక్తి, శ్రద్ధ, వైభవంతో కళకళలాడింది. గణపతి హోమం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, అలాగే అయ్యప్ప స్వాములకు భిక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలు ఉదయం నుంచి పరిపూర్ణ వైభవంతో ప్రారంభమయ్యాయి. అయ్యప్ప మాలధారులు పాల్గొన్న భిక్ష కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయ్యప్ప స్వాములకు సంప్రదాయ పద్ధతిలో భిక్ష ఇచ్చి, వారి పాదసేవను అనుభవిస్తూ భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పూజల్లో పాల్గొన్న మల్లారెడ్డి మాట్లాడుతూ “ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అభ్యుదయంతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. భగవంతుడి దీవెనలతో ప్రతి ఇంటిలో శాంతి, సౌభాగ్యం నింపాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను” అని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రముఖ నాయకులు తోకలు శ్రీనివాస్ రెడ్డి, సాబాధ విజయ్ కుమార్ గురుస్వామి, రాజు పహిల్వాన్, తదితర నాయకులు పాల్గొని ఈ భక్తి కార్యక్రమాలలో భాగస్వాములయ్యారు. హోమం, వ్రతం అనంతరం మహా ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు. సామాజిక సేవ, ధార్మిక కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండే మల్లారెడ్డి స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానికుల నుండి మంచి స్పందన లభించింది.
