అత్తాపూర్లో సాయి ఈశ్వర చారి చిత్రపటానికి నివాళులు అర్పించిన బీజేపీ నాయకులు
ఇది కద నిజం, అత్తాపూర్ : అత్తాపూర్ డివిజన్ అధ్యక్షులు సుల్గే వెంకటేష్ ఆధ్వర్యంలో హైదర్గూడా చౌరస్తాలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం ఆత్మబలిదానం చేసుకున్న సాయి ఈశ్వర చారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి వై. శ్రీధర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని వాగ్దానం చేసి, తర్వాత మోసం చేసింది. ఆ నిరాశ, ఆవేదనను తట్టుకోలేక ఈశ్వర చారి పెట్రోల్ పోసుకొని ప్రాణాలు తీసుకోవడం చాలా బాధాకరం” అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో జయలలిత అమలు చేసిన 60% రిజర్వేషన్ విధానాన్ని చూసి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పలికారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి, జిల్లా కార్యదర్శి కొమురయ్య, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కడెం సుధాకర్, అత్తాపూర్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు రావుల జగన్, పెంజర్ల వెంకట్ రెడ్డి, జయనంద్ రెడ్డి, రమేష్, అనురాధ, శ్రీకాంత్ చారి, మల్లేష్ చారి, లక్ష్మీకాంత్ రెడ్డి, శివరాజ్ గౌడ్, బాలకృష్ణ, విజయస్వామి, సతీష్, భరత్, రాంభూపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
