సికింద్రాబాద్‌లో ఘనంగా గంగపుత్ర సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
ఇది కద నిజం,సికింద్రాబాద్, జనవరి 27: సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని తుకారాం గేట్ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. సికింద్రాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే టి. పద్మారావు గౌడ్ తన చేతుల మీదుగా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం బలోపేతానికి, సభ్యుల సంక్షేమానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంఘం అధ్యక్షులు కైరం కొండ యాదగిరి, ప్రధాన కార్యదర్శి కరెలి రామానుజం నేతృత్వంలో జరిగిన ఈ ఆవిష్కరణలో ఉపాధ్యక్షులు పల్లె బాలయ్య, కార్యదర్శి పెంటం రవి, ప్రచార కార్యదర్శి కుంట యాదగిరి తమ సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మామిండ్ల జగదీష్, అంగలి లక్ష్మి నర్సిములు, గౌటే సురేందర్ మరియు ఇతర సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సంఘం సభ్యులందరూ ఐకమత్యంతో ఉండి అభివృద్ధి పథంలో నడవాలని ఈ సందర్భంగా నేతలు పిలుపునిచ్చారు.
