మంత్రులతో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య భేటీ
*యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రులతో చర్చించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య*
ఇది కద నిజం, భువనగిరి జిల్లా: హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగుల,వృద్ధుల సంక్షేమ శాఖ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గంధమల్ల ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, గంధమల్ల రైతుల సహా పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.నియోజకవర్గంలోని సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రులను ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కోరారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రులు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
