నిజాంపూర్‌లో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు

నిజాంపూర్‌లో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు

పాఠశాల విద్యార్థుల ఆటపాటల మధ్య జెండా ఆవిష్కరణ

ఇది కద నిజం,నిజాంపూర్: గ్రామ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు గ్రామ పెద్దలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన దేశభక్తి ప్రదర్శనలు మరియు జెండా వందనం కార్యక్రమం ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే క్రమశిక్షణతో కూడిన దేశభక్తిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతల గురించి విద్యార్థులకు వివరించారు. ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) దుర్గా ప్రసాద్ సార్ నేతృత్వంలో విద్యార్థులు క్రమశిక్షణతో కవాతు నిర్వహించి జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *