చైనా మాంజాపై సైబరాబాద్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
*ప్రమాదకరంగా వేలాడుతున్న నిషేధిత మాంజా తొలగింపు*
ఇది కద నిజం: రోడ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు, నివాస ప్రాంతాల్లో ప్రమాదకరంగా వేలాడుతున్న నిషేధిత చైనీస్ మాంజా తొలగింపునకు ఈరోజు సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో సైబరాబాద్ పోలీసులు ఈరోజు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించారు. ఈ చైనీస్ మాంజా ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పక్షులు, జంతువులకు తీవ్ర ప్రమాదం కలిగిస్తుందని విధితమే. కేపీహెచ్‌బీ, మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా ఈ స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టారు. ఈ క్రమంలో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కేపీహెచ్‌బీ ఎస్హెచ్ఓ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, జీహెచ్ఎంసీ అధికారుల సహకారంతో కేపీహెచ్‌బీ 3వ ఫేజ్, 4వ ఫేజ్, రోడ్ నెం.1, అడ్డగుట్ట, 100 ఫీట్ రోడ్, హైదర్‌నగర్, వసంత్‌నగర్ ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు, రోడ్లు, భవనాలు తదితర వాటిపై ప్రమాదకరంగా వేలాడుతున్న మాంజాను తొలగించారు. అలాగే గాలిపటాలు, మంజా విక్రయ దుకాణాల్లో తనిఖీలు చేశారు. వీటిని వినియోగించవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుకాణాలు, వ్యాపార కేంద్రాలను తనిఖీ చేశారు. చైనీస్ మాంజా వాడకం చట్ట విరుద్ధమని, కొన్నా, వినియోగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. జీడిమెట్ల పోలీస్ ఆధ్వర్యంలో చైనా మాంజా ప్రమాదాలపై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. కూకట్పల్లి, మియాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోను రోడ్లపై ఉన్న మాంజా ను తొలగించారు. చైనా మాంజా చట్ట విరుద్ధమని, దాని తయారీ, విక్రయం, నిల్వ లేదా వినియోగం నేరమని, ఇటువంటి చర్యలపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. చైనీస్ మాంజా విక్రయం లేదా వినియోగం ఎక్కడైనా జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. *ఎక్కడైనా మాంజా వేలాడుతూ కనిపిస్తే జాగ్రత్తగా దాన్ని తొలగించి డిస్పోజ్ చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
